చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ విష్ణువర్ధన్ శంకర్ గౌడ్

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఎండలు తీవ్రత రోజుకు ఘననియంగా పెరగడంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని గ్రామస్తులు అన్నారు. భీమ్‌గల్ మండలంలోని బడా భీమ్‌గల్ గ్రామంలో బస్టాండ్ వద్ద శుక్రవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ రాచకొండ విష్ణువర్ధని,ఉప సర్పంచ్ శంకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ పాలకవర్గం సభ్యులు అలాగే స్థానిక నాయకుల తో కలిసి రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, విష్ణువర్ధని శంకర్ గౌడ్ గ్రామ పాలకవర్గం కోరిక మేరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ అన్నారు. రోజు రోజుకు ఎండ తీవ్రత గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ విష్ణువర్ధని, ఉప సర్పంచ్ శంకర్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ రజిత, వార్డ్ మెంబర్ లు మండ్రా సుమన్ రాజకుమార్, అరును, దాస్, మల్లెల శ్రీకాంత్, మాజీ వార్డ్ మెంబర్ పిట్ల శ్రీనివాస్, కారోబారులు నర్సయ్య, శేఖర్, నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
