పది విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించిన సర్పంచ్

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; తమ గ్రామ విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షల్లో 100 శాతం మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లి సర్పంచ్ నర్సిములు శనివారం దాతృత్వాన్ని చాటుకున్నారు. ఊట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పదిమంది విద్యార్థులు బిజ్వార్ జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తుండగా ప్రభుత్వం శనివారం నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించడంతో ఆ గ్రామానికి చెందిన విద్యార్థులకు మండలంలోని పులిమామిడి పరీక్ష కేంద్రంలో పరీక్షలు వ్రాయాలి.
కొత్తపల్లి గ్రామం నుంచి పులిమామిడి గ్రామానికి 8 కిలోమీటర్ల రవాణా సౌకర్యం లేకపోవడంతో స్పందించిన సర్పంచ్, ఆర్. నర్సిములు పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగిసేవరకు ఆటో ద్వారా రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి తన ఉదారత్వాన్నిచాటారు. చదువుతూనే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయవచ్చని విద్య వైద్య రంగానికి తన వంతు సహకారం అందజేస్తానని సర్పంచ్ నర్సిములు వివరించారు. తమ పిల్లలు పరీక్షలు రాసి వచ్చేందుకు సర్పంచ్ రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు అభినందించిహర్షంవ్యక్తం చేస్తున్నారు.
