కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ ; మండలంలోని పురాణిపేట్ గ్రామ సర్పంచ్ బుర్ర సుమ, దేవేందర్ గౌడ్ గురువారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీ లో కొనసాగిన సర్పంచ్ దంపతులు పార్టీ విధానాలు నచ్చక కాంగ్రెస్ లో చేరినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లో చేరిన వీరికి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ మోర్తాడ్ ప్రజానీలయం లో పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధిని గమనించి పార్టీ లోకి స్వచ్చందంగా వస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ తోనే సమ న్యాయం జరుగుతుందని ముత్యాల పేర్కొన్నారు. పార్టీ బలోపేతం, ప్రజా పాలన పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు దోహదం చేస్తామని ఈ సందర్బంగా సర్పంచ్ దంపతులు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కన్నె సురేందర్, బోదిరే స్వామి, అనంత్ రావు, జేజే నర్సయ్య, తోట శంకర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply