పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన సర్పంచ్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. 15 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారు చూపుతున్న అంకితభావాన్ని గుర్తించి సర్పంచ్ జాడి మహేశ్వర్, పంచాయతీ కార్యదర్శి శ్రీలత వారిని శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మహేశ్వర్ మాట్లాడుతూ.. గ్రామం పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఎండనక, వాననక వారు పడుతున్న శ్రమను గుర్తించి గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం కార్మికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ వారికి ఉచితంగా హెల్త్ చెకప్ నిర్వహించారు. ప్రతి కార్మికుడు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బత్తుల రమేష్, సుంకర గట్టయ్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
