గ్రామ కార్మికులకు ప్రభుత్వం వేతనం ఇవ్వాలి

గ్రామ కార్మికులకు ప్రభుత్వం వేతనం ఇవ్వాలి

కొడిమ్యాల, ఆంధ్రప్రభ: గ్రామ పంచాయతిలో పని చేసే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని కొడిమ్యాల మండల మాజి సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికె 1000 జనాభా కలిగిన చిన్న పంచాయతిలు ట్రాక్టర్ డీజిల్ కు , విద్యుత్ చార్జీలు, మోటార్లు, చేతిపంపులు, పైపులైన్ మరమ్మతులు, పండగల నిర్వహణ, పరిశుభ్రత, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయుట వంటి పనులకే నిధులు సరిపోక కొట్టుమిట్టాడు తున్నయని, పంచాయితీ వసూలు చేసే ఇంటి పన్నులు, నల్ల బిల్లులు ట్రెజరీలో జమచేసి తీర్మానం మేరకు చెక్కులు జారీ చేస్తే సంవత్సరం వరకు కూడా సంబంధిత వారికి రూపాయలు జమ కాకుండా ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిందన్నారు.

15వ ఆర్థిక సంఘం నుండి వచ్చే నిధులు కూడా పూర్తిగా రావడం లేదని వాటి నుండి మూడు శాతం పంపు మెకానిక్ మండల కంప్యూటర్ ఆపరేటర్ వేతనాలకు మండల పరిషత్ కు ఇవ్వడం జరుగుతుందని కాబట్టి కార్మికుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని కోరారు ఈ సమావేశంలో సర్పంచులు ల్యాగల రాజేశం, గోలి ఐలయ్య, మల్యాల అనసూర్య,భూత్కూరి అర్చన కోరండ్ల సప్న, ఎలుకపల్లి సుమలత పాల్గొన్నారు.

Leave a Reply