Sarpanch | బెల్లాల్ ను అభివృద్ధి చేస్తా..

Sarpanch | బెల్లాల్ ను అభివృద్ధి చేస్తా..
- బెల్లాల్ గ్రామ నూతన సర్పంచ్ బొంతల లక్ష్మి భూమన్న యాదవ్
Sarpanch | కడెం, ఆంధ్రప్రభ : రాబోయే ఐదేళ్ల లోపు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సహకారంతో బెల్లాల్ గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని బెల్లాల్ గ్రామ సర్పంచ్ బొంతల లక్ష్మి డాక్టర్ భూమన్న యాదవ్ అన్నారు. కడెం మండలం బెల్లాల్ జిపి గ్రామ సర్పంచ్ గా బొంతల లక్ష్మి డాక్టర్ భూమన్న యాదవ్ ఉప సర్పంచ్ గా ఎల్తపు అనూష శ్రీనివాస్ జిపి, వార్డు సభ్యులను కడెం ఎంపీఓ టి శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఎంపీఓ మొదటగా సర్పంచ్ గా బొంతల లక్ష్మి, ఉప సర్పంచ్ గా ఎల్తపు అనూష, వార్డు సభ్యులు బక్కతట్ల వెంకటేష్ మల్యాల లలిత దాసండ్ల శ్వేత ఎస్ వెంకటరమణ యాదవ్, పంచతి శ్రీనివాస్, చక్కటి లలిత, అత్రంఆ రాజేష్ సుద్దాల సంజయ్ కుమార్ ఆర్షం లచ్చవ్వ లను ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బొంతల లక్ష్మి ఉప సర్పంచ్ ఎల్తాపు అనూష వార్డు సభ్యులను, గ్రామ పెద్దలు, పలు పార్టీల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, యువకులు, అభిమానులు, స్థానిక పంచాయతీ సెక్రెటరీ వి గిరిధర్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బొంతల లక్ష్మి మాట్లాడుతూ… గ్రామ పెద్దల, ప్రజల, యువకులు, మహిళలు సహకారంతో గెలిపించినందుకు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జు సహకారంతో బెల్లాల్ జిపిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆమె అన్నారు.
