Sarpanch | అభివృద్ధి కోసం ఓటు వేయండి

Sarpanch | అభివృద్ధి కోసం ఓటు వేయండి
- మోసపోతే గోస తప్పదు
- బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన మంథన్ గోడ్ సర్పంచ్ అభ్యర్థి నరేందర్ రెడ్డి
Sarpanch | మక్తల్, ఆంధ్రప్రభ : ఆలోచించండి.. మంచి నిర్ణయం తీసుకోండి.. చిన్నపాటి అనాలోచితం నిర్ణయం వల్ల ఐదేళ్ల పాటు బాధపడాల్సి వస్తుంది.. మోసపోయి గోస పడకండి.. అభివృద్ధి కోసం బీఆర్ఎస్, బీజేపీ పార్టీ బలపరిచిన తనను సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా ఇవాళ ఆయన తన మద్దతుదారులతో కలిసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని మంథన్ గోడ్ గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ గా తనకు ఒక అవకాశం ఇవ్వాలని గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.
గ్రామంలోని ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందని, గ్రామంలోని ప్రతి వ్యక్తి రాజకీయాలు పక్కనపెట్టి గ్రామాభివృద్ధి కోసం తనను సర్పంచ్ గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తన గెలుపుతో గ్రామం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని ప్రచారంలో ప్రజలకు వివరించారు. సర్పంచ్ గా ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి అండగా నిలవాల్సిందిగా గ్రామ ప్రజలను సర్పంచ్ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్రాములు, ప్రతాప్ రెడ్డి, వెంకటేశ్వరమ్మ, వెంకటమ్మ, రాజేశ్వరి, సుధా, నరేందర్ రెడ్డి, బాల్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
