Sarpanch | మంత్రి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
- మల్లన్నపేట సర్పంచ్ అభ్యర్థి బీమా సుజాత సంతోష్
Sarpanch | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి బీమా సుజాత సంతోష్ తెలిపారు. గతంలో సర్పంచిగా మండల పరిషత్ అధ్యక్షురాలుగా పనిచేసిన అనుభవంతో గ్రామంలోని సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచిగా పోటీకి దిగాలని, గ్రామంలో అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు బీమా సుజాతకు మద్దతు పలుకుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి ముందుంటానన్నారు. తన కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

