Sarpanch | అవకాశం ఇస్తే.. ప్రజా సేవ చేస్తా
- కస్ర గ్రామ సర్పంచ్ అభ్యర్థి జాదవ్ అమృత దేవిదాస్
Sarpanch | కుబీర్, ఆంధ్రప్రభ : కస్ర గ్రామ అభివృద్ధి జరగాలంటే ఈ నెల 17న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఉంగరం గుర్తు పై ఓటేసి గెలిపించాలని గ్రామాల్లోని వీధుల్లో ఇంటింటా తిరుగుతూ శుక్రవారం జాదవ్ అమృత దేవిదాస్ విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. గ్రామంలో నెలకొన్న అన్ని సమస్యలను తాను సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే అన్ని సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చా రు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ వ్యవస్థ. సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాద్యతాను ఇస్తానని ఆమె హామీ ఇచ్చారు. అన్ని నెలలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చి గ్రామంలో విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాల్లోని మౌలిక వసతులు కల్పనకు దశలవారీగా కృషి చేస్తారని.. అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని అన్నివేళల గ్రామం పైప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలను పరిష్కారం చూపి ద్రోవాదపడతానని పేర్కొన్నారు. ఆమెతో పాటు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు.

