Sarpanch | నిరంతరం కృషి చేస్తా

Sarpanch | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండల్(Bhimgal Mandal) జాగిర్యాల్ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడాల లక్ష్మణ్ అన్నారు. భీమ్‌గల్ మండలంలోని జాగిర్యాల్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా గడాల లక్ష్మణ్(Gadala Lakshman) ను కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం.. అవసరమైన పనుల కోసం.. నిధులు తెచ్చి పని చేస్తానని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు, గ్రామంలో ఉండే పేద ప్రజలకు వైద్య ఖర్చుకు ఎల్ఓసి, కళ్యాణ లక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని పథకాలను ప్రజలకు(schemes to the public) అందేలా చేస్తానని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ సేవలందిస్తున్నానని.. ఎన్నికలలో తనను బలపరిచి తమకు ఓటు(Vote for yourself) వేయాలి అన్నారు. అందు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తన గెలుపు కోసం కృషి చేయాలని అభ్యర్థి గడాల లక్ష్మణ్ కోరారు.

Leave a Reply