సారపాక బీటెక్ విద్యార్థి దుర్మరణం..

బూర్గంపహాడ్, ఆంధ్రప్రభ : నిరుపేద కుటుంబంలో జన్మించి మొదటి నుండి ప్రభుత్వ విద్యనే అభ్యసిస్తూ 10 ఇంటర్ తో పాటు ఎంసెట్లో పదివేల ర్యాంకు సాధించి ఉన్నత చదువు కోసం గుంటూరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న చిట్టి నాగ వెంకట్ రెడ్డి మరణంతో సారపాకలో విషాదఛాయలు అనుముకున్నాయి. బూర్గంపాడు మండలం సారపాక కు చెందిన చిట్టి పుల్లారెడ్డి సరిత దంపతుల ప్రధమ కుమారుడైన నాగ వెంకటరెడ్డి గురువారం సాయంత్రం గుంటూరు హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న చిట్టి పుల్లారెడ్డి ప్రధమ కుమారుడు నాగ వెంకటరెడ్డి మొదటి నుండి చదువులో ప్రతిభను కనబరుస్తూ 10 ఇంటర్ ఫలితాలతో పాటు ఎంసెట్ లోను పదివేల ర్యాంకును సాధించి ప్రభుత్వ కోటాకింద బీటెక్ లో ఉచిత సీటును సాధించారు. కళాశాల అంతర్గత పరీక్ష ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం విజయవాడకు చెందిన తన స్నేహితుడు తన ఇంటికి వెళ్దాం అన్నా అభ్యర్థన మేరకు స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్రమంలో గుంటూరు హైవేపై ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొని ద్విచక్ర వాహనంపై నుండి ఇద్దరు క్రింద పడిపోగా వెనక నుండి వేగంగా వస్తున్న కంటైనర్ లారీ నాగ వెంకట్ రెడ్డి తలభాగం నుండి వెళ్లగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు తన స్నేహితుడు సైతం తీవ్ర గాయాలు కాగా అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు.

ఉన్నత చదువు కోసం రాష్ట్రం దాటి వెళ్లిన నాగ వెంకట్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో సారపాకలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగ వెంకట్ రెడ్డి మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం శుక్రవారం తన స్వగ్రామమైన సారపాకకు తీసుకువచ్చారు. విద్యలో ముందు ఉంటూ క్రమశిక్షణ కలిగిన నాగ వెంకటరెడ్డి మృతదేహాన్ని సందర్శించిన పలువురు కన్నీళ్ళతో నివాళులు అర్పించారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగ వెంక రెడ్డి అకస్మాత మృతి తో అతని తల్లితండ్రులు కన్నీరు మునీరుగా తిలపించడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది

Leave a Reply