Sankranti Heroes | ప్రమోషన్స్ కు దూరం..?

Sankranti Heroes | ప్రమోషన్స్ కు దూరం..?
Sankranti Heroes | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా.. ప్రమోషన్స్ చేయకపోతే.. జనాలు థియేటర్స్ కి రారు. ఇప్పుడు ఎంటర్ టైన్మెంట్ కోసం ఆడియన్స్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందుచేత ఆడియన్స్ ఆకట్టుకుని.. సినిమాకి వచ్చేలా చేయాలంటే.. గట్టిగా ప్రమోషన్స్ చేయాలి. అయితే.. సంక్రాంతికి ఓ అర డజను సినిమాలు (Movies) వస్తున్నాయి కానీ.. ప్రమోషన్స్ కు మాత్రం హీరోలు రావడం లేదు. ఇంతకీ.. ప్రమోషన్స్ కు దూరంగా ఉన్న హీరోలు ఎవరు..?

Sankranti Heroes | బాలీవుడ్ ప్రమోషన్స్ కు దూరంగా ప్రభాస్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ రాజాసాబ్. మారుతి తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇటీవల ముంబాయిలో సాంగ్ లాంచ్ చేశారు కానీ.. ప్రభాస్ (Prabhas) రాలేదు. ఇంత వరకు ఈ సినిమాకి సంబంధించిన ఒక్క ఇంటర్ వ్యూ ప్రభాస్ ఇవ్వలేదు. మీడియా ముందుకు ప్రభాస్ రావడం అనేది అనుమానమే అని వినిపిస్తోంది. ప్రభాస్ తో ఓ ఇంటర్ వ్యూ చేయించి అదే ఇంటర్ వ్యూను రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. గత సినిమాల కంటే ఈ సినిమా ప్రమోషన్స్ బాగా దూరంగా ఉన్నాడు ప్రభాస్.

Sankranti Heroes | చిరుకు సర్జరీ.. ప్రమోషన్స్ కు దూరం..
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి ఇంటర్ వ్యూలు ఇస్తున్నాడు. ఈ నిర్మాతలు మాత్రం మీడియా (Media) ముందుకు వచ్చారు. అయితే.. చిరంజీవి ఈ మూవీకి సంబంధించి ఒక్క ఇంటర్ వ్యూ కూడా ఇవ్వలేదు. అయితే.. ఆయన కాలుకు సర్జరీ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు వస్తారట కానీ.. మీడియా ముందుకు వస్తారా రానా అనేది అనుమానమే. ఆయనకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీడియా ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

Sankranti Heroes | రవితేజ, శర్వా.. ఎక్కడ..?
ఇక మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ (Kishore) తిరుమల తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు కానీ.. రవితేజ మాత్రం మీడియా ముందుకు రాలేదు. చాలా వరకు ఆయన దూరంగా ఉంటారు. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి అనే సినిమా వస్తున్నాడు. ఆయన కూడా ఇంత వరకు మీడియా ముందుకు రాలేదు. వస్తాడా..? రారా అనేది క్లారిటీ లేదు. సంక్రాంతికి వస్తున్న హీరోల్లో నవీన్ పొలిశెట్టి మాత్రమే మీడియా ముందుకు వచ్చాడు. ప్రమోషన్స్ బాగా చేయాల్సిన ఈ టైమ్ లో దూరంగా ఉన్నారు.. మరి.. రిలీజ్ ముందైనా మీడియా ముందుకు వస్తారేమో చూడాలి.

