Sankranti | సందడి.. కిక్కిరిసిన రైళ్లు..

Sankranti | సందడి.. కిక్కిరిసిన రైళ్లు..

  • వరంగల్ రైల్వేస్టేషన్లో భారీ రద్దీ
  • బోగీలు పెంచాలని ప్రయాణికుల డిమాండ్

Sankranti | కరీమాబాద్, ఆంధ్రప్రభ : సంక్రాంతి సందడితో రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వరంగల్ రైల్వేస్టేషన్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణించే ప్రయాణికులు, శబరిమలైకి తరలివెల్లి అయ్యప్ప స్వాములతో రైల్వే స్టేషన్లు కిటకిట లాడుతున్నాయి. ఈ రోజు పలు రైళ్లు ప్రయాణికులతో రద్దీగా మారి కిటకిటలాడుతున్నాయి. నిలబడేందుకు చోటు లేదు, సంక్రాంతి వేల మరిన్ని రైళ్లు పెంచాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు.

రెగ్యులర్ గా నడిచే రైళ్లకు అదనంగా ప్యాసింజర్ బోగీలు తగిలించి రద్దీ తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. రైలు వచ్చి బయలుదేరే సమయానికి ప్రయాణికులు అందరూ రైలు ఎక్కలేక పోతున్నారు. 1 నిమిషంలో ఎక్కి దిగడం సాధ్యం కావడం లేదు. జిల్లా హెడ్ క్వార్టర్స్, జంక్షన్ లో మరొక నిమిషం వేయిటింగ్ ఇవ్వాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు.

పండుగ వేళ తల్లిదండ్రులు, పిల్లలు, వృద్దులు వేగంగా ఎక్కలేకపోవడంతో కొందరు రైలు ఎక్కడం మరికొందరు స్టేషన్లో ఆగిపోవడం జరుగుతుంద‌న్నారు. దీంతో గాబరా పడుతున్న వారు ట్రైన్ చైన్ లాగడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలు అధిగమించాలంటే ట్రైన్ ఆగి ఉండే సమయాన్ని మరొక నిమిషం పొడిగించవలసిందిగా కోరుతూ… అలాగే రైలు వచ్చే ముందర పలుమార్లు అనౌన్స్మెంట్ చేసి ప్రయాణికులను అప్రమత్తం చేయాల్సి ఉంటుంద‌న్నారు.

రద్దీ సమయంలో జి ర్ పి ఆర్పిఎఫ్ పోలీసులు, సంయుక్తంగా రైళ్లు వచ్చే వేళలో అప్రమత్తంగా ఉండి ప్రయాణికులు ప్రమాదానికి గురికాకుండా చొరవ తీసుకొని అప్రమత్తంగా వ్యవహరించాల‌న్నారు. సంయుక్తంగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే రద్దీ నుండి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంద‌న్నారు.

ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నందున ఎలాంటి సమస్యలు, ప్రమాదాలు తలెత్తకుండా అధికారులు సమన్వయంగా చొరవ తీసుకొని ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యాలకు చేర్చాల్సిందిగా వ్యవహరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a Reply