Sankranti | పతంగులు ఎగురవేస్తున్నారా..? జర జాగ్రత్త..!

Sankranti | పతంగులు ఎగురవేస్తున్నారా..? జర జాగ్రత్త..!

Sankranti | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సంక్రాంతి పండుగ వ‌చ్చిందంటే ఆ సంద‌డే వేరుంటుంది. గంగిరెద్దులు ఆట‌లు, మ‌హిళ‌లు వేసే రంగవల్లులు, ఇంటి ముందు గొబ్బెమ్మలు ఇలా ఎన్నో ప్ర‌త్యేక‌లుంటాయి. వీటితో పాటు ఈ పండుగ‌కు గాలి పటాలు ఎగురవేస్తూ ఆనందిస్తుంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అందరూ పతంగులు ఎగురవేస్తుంటారు. ఈ పండుగ వేళ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పండగను ఆనందంగా జరుపుకునేందుకు జాగ్రత్తలు (Precautions) తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. గాలి పటం ఎగురవేసే సమయంలో ధ్యాసంతా దానిపైనే ఉంటుంది. ఈ సమయంలో గోడలు, మిద్దెలు, ఎత్తైన భవనాలు, మైదానాల నుంచి ఎగురవేస్తూ ప్రమాదాలు చోటుచేసుకునే అవ‌కాశం ఉంది.

Sankranti

ఇలా జాగ్ర‌త్త ప‌డండి..

  • భవనాలపై ప‌తంగులు ఎగుర వేయ‌క‌పోవ‌డం మంచిది.
  • నిర్మానుష్య ప్రదేశాలు, ఆట స్థలాలు, తదితర అనువైన ప్రాంతాల్లో ఎగురవేయండి.
  • రద్దీ ప్రాంతాల్లో, జన సంచారం ఉన్న చోట ఎగురవేయకూడదు.
  • దారం రోడ్డుకు అడ్డుగా పడితే వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
  • పతంగి తెగి పడితే పైకి చూస్తూ దాని వెంట వెళ్లకండి.
  • కరెంట్​ తీగలు, చెట్లు లేని ప్రదేశాలు చూసుకోవాలి.
  • చైనా మాంజాకు బదులు సంప్రదాయ దారం వాడాలని పర్యవేరణ వేత్తలు, అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
  • పిల్లలు, యువకులు విద్యుత్‌ వైర్ల మీద పడిన గాలి పటాలను తీసేందుకు ప్రయత్నించరాదు.
  • కాటన్‌, నైలాన్‌, లినెన్‌తో చేసిన మాంజాలను మాత్రమే వాడాలి.
  • మెటాలిక్‌ మాంజాలు విద్యుత్‌ వాహకాలు కనుక అవి లైన్లపై పడ్డప్పుడు విద్యుత్‌ షాక్‌ కలిగే అవకాశం ఉంది.
  • భవనాల మీద నుంచి గానీ, సగం నిర్మించిన గోడల మీద నుండి పతంగులు ఎగురవేసే ప్రయత్నం చేయరాదు.
  • ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే 1912కు కాల్ చేయ‌వ‌చ్చు.

CLICK HERE TO READ వంతెన నిర్మాణం పనుల నాణ్యత పరిశీలన

CLICK HERE TO READ MORE

Leave a Reply