WGL | కోతుల దాడి.. గాయపడిన పారిశుధ్య కార్మికురాలు
వరంగల్ కరీమాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రప్రభ) : వరంగల్ నగరంలోని 34వ డివిజన్ శివనగర్ లో పారిశుద్ధ కార్మికురాలు గన్నారపు తేజపై కోతులు దాడిచేయగా కార్మికురాలు తీవ్రంగా గాయపడింది. మంగళవారం గన్నారపు తేజ (50) ఉదయం తన విధుల్లో నిమగ్నమై ఉండగా ఆమెపై కోతులు దాడిచేయగా ఎడమ చేయిపై తీవ్ర గాయమైంది.
పరిగెత్తే క్రమంలో కింద పడడంతో మోకాళ్ళకు గాయాలయ్యాయి. స్పందించిన స్థానికుడు అమర్, మహేష్ 108కు సమాచారం అందించగా, 108 అంబులెన్సులు గాయపడిన పారిశుద్ధ కార్మికురాలును జవాన్ సుమన్, మలేరియా వర్కర్ దేవేందర్ 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.