Sangareddy | బాలుడికి కుక్క కాటు… కమిషనర్ పరామర్శ
ఫిబ్రవరి 15, ఆంధ్ర ప్రభ : శనివారం ముత్తంగి గ్రామ పరిధిలో న్యూ టౌన్ కాలనీలో నివసించే కంరుద్దీన్ కుమారుడిని కుక్కలు కరిచిన సంఘటనపై తెల్లాపూర్ కమిషనర్ విచారణ చేశారు. కుక్కకాటు బాధిత కుటుంబాన్ని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఐదు కుక్కలు దాడి చేసి తమ పిల్లవాడిని తీవ్రంగా గాయపరిచాయని తెలిపారు. అంగన్వాడీ స్కూల్లో పనిచేసే మరో బాలుడిని సైతం అదే రోజు కుక్కలు కరిచాయని అంగన్వాడీ కేంద్రం టీచర్లు కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం.
స్పందించిన కమిషనర్ సంగారెడ్డి బాలుడికి మెరుగైన చికిత్స అందించేందుకు నారాయణగూడలోని రేబిస్ చికిత్స అందించే సర్కారు ప్రత్యేక దవాఖానాకు బాలుడిని పంపించారు. న్యూటౌన్ కాలనీలో ఉన్న కుక్కలను తీసుకెళ్లి వ్యాక్సినేషన్ చేయిస్తామని కమిషనర్ ఈ సందర్భంగా తెలిపారు. ముత్తంగిలో కొద్దిరోజుల క్రితం కూడా కుక్కలను పట్టుకొని వ్యాక్సినేషన్ చేయించినట్టు ఆయన వివరించారు. కరిచిన కుక్కలపై నెల రోజులపాటు నిఘా పెడుతున్నామని పేర్కొన్నారు.