
Sangareddy | వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
Sangareddy | వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
- 12వ వార్డు బీజేపీ అభ్యర్థి సాహితీ రాము
Sangareddy | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా సాహితీ రాము ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆయనకు పలు సమస్యలపై విన్నవించారు. అనంతరం సాహితీ రాము మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాన్నని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వార్డులో అభివృద్ధి శూన్యంగా మారిందని, రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయని విమర్శించారు. తాను గెలుపొందితే కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను కచ్చితంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎంపీ, ఎమ్మెల్సీ నిధులను సద్వినియోగం చేస్తూ వార్డు అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టినప్పటికీ, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తనకు అవకాశం ఇస్తే వార్డు సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలే తన విజయానికి బాటలు వేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
