ఇసుక ట్రాక్టర్ సీజ్

ఇసుక ట్రాక్టర్ సీజ్

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం చౌటు పల్లి గ్రామానికి అక్రమంగా ఇసుకను రవాణ చేస్తున్న ఇసుక ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లు కమ్మర్ పల్లి ఎఫ్ ఆర్ వో రవీందర్ నాయక్ మంగళవారం తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం… లకావత్ రాజేందర్ వాసం గట్టు తండా కోనాపూర్ అక్రమంగా ఇసుకను తరలిసున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కన్సర్న్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, బిట్ ఆఫీసర్ లు కలిసి ఇసుక ట్రాక్టర్ ను పట్టుకుని సీజ్ చేసి, కేసు నమోదు చేసి, ట్రాక్టర్ ను అటవీ శాఖ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. అక్రమంగా ఇసుకను రవాణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply