GT vs PBKS | సాయి సుద‌ర్శ‌న్ స్ట‌న్నింగ్ హాఫ్ సెంచ‌రీ !

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లో పంజాబ్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో… గుజ‌రాత్ టైట‌న్స్ అద్భుతంగా పోరాడుతొంది. పంజాబ్ నిర్ధేవించిన 244 ప‌రుగుల‌ భారీ ఛేద‌న‌లో… గుజ‌రాత్ బ్యాట‌ర్లు కూడా దంచేస్తున్నారు. ఈ క్ర‌మంలో యంగ్ ప్లేయ‌ర్ సాయి సుద‌ర్శ‌న్ అర్ధ శక‌తం బాదాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సుల‌తో 50 ప‌రుగులు సాధించాడు.

ఆరు ఓవ‌ర్ల‌కు కెప్టెన్ గిల్ (33) ఔటైనా.. ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ – వ‌న్ డౌన్ లో వ‌చ్చిన జాస్ బ‌ట్ల‌ర్ ప‌రుగుల వ‌ర‌దపారిస్తున్నారు. ప్ర‌స్తుతం 10 ఓవ‌ర్లు మిగిసే స‌రికి గుజ‌రాత్ స్కోర్ 107/1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *