Tej | ప్లాన్ ఫలించేనా..?

Tej | ప్లాన్ ఫలించేనా..?

  • సంబరాల ఏటిగట్టు రిలీజ్ ప్లాన్ ఏంటి?
  • కొత్త దర్శకులతోనే సినిమాలు చేయాలన్న తేజ్ నిర్ణయం
  • తేజ కాకమాను, సిద్దు కథలకు గ్రీన్ సిగ్నల్?
  • యు.వీ క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రాజెక్టులు
  • సాయిదుర్గ తేజ్ స్పీడ్ పెరుగుతుందా?

Tej | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ మేనల్లుడు, సాయిదుర్గ తేజ్.. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరకు రిలీజ్ కాలేదు. సమ్మర్ లో ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ (Release) చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తేజ్ నెక్ట్స్ ఏంటి అంటే.. అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే.. కొత్త దర్శకులతో సినిమాలు చేయాలి అనుకుంటున్నాడని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ.. తేజ్ ని మెప్పించిన కొత్త దర్శకులు ఎవరు..? ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కేది ఎప్పుడు…?

Tej

Tej | సాయి దుర్గ తేజ్..

కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు యామా స్పీడు చూపించాడు. ఆతర్వాత ఆ స్పీడు కాస్త తగ్గింది. విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత మరింత దూకుడు పెంచుతాడు అనుకున్నారు కానీ.. యాక్సిడెంట్ కారణంగా మరింత స్లో అయ్యింది. ఇప్పుడు కొత్త దర్శకుడు రోహిత్ తో (Rohith) చేస్తున్న సంబరాల ఏటిగట్టు డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది. హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. కథ పై ఉన్న నమ్మకంతో 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం.

Tej

Tej | ఇక అసలు విషయానికి వస్తే..

తేజ్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ తో సినిమా చేయాలి అనుకోవడం లేదు. కొత్త దర్శకులతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండడం విశేషం. సేవ్ ది టైగ‌ర్స్‌ తో ఆక‌ట్టుకొన్న ద‌ర్శ‌కుడు తేజ కాక‌మాను. ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కోసం ఓ క‌థ సిద్ధం చేశారట. తేజ్ కి (Tej) కథ చెబితే నచ్చిందని.. సినిమా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించ‌నుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. త్వ‌ర‌లోనే ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రావొచ్చని సమాచారం.

Tej

ఇక తేజ్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ ఓ సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని తెలిసింది. ఈ సినిమాతో సిద్దు అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. తేజ కాకమాను, సిద్దు.. ఈ ఇద్దరిలో ముందుగా తేజ సినిమానే స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. క మూవీని తెరకెక్కించిన దర్శకద్వయం కూడా తేజ్ కోసం కథ రెడీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే దేవ కట్టా కూడా తేజ్ కోసం పవర్ ఫుల్ స్టోరీ (Power Full Story) రెడీ చేస్తున్నారట. మొత్తానికి తేజ్ ఇక నుంచి స్పీడు పెంచబోతున్నారు. మరి.. ఈ సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

CLICK HERE TO READ రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే..?

CLICK HERE TO READ MORE

Leave a Reply