ADB | యూపీఎస్సీలో 68వ ర్యాంకు సాధించిన సాయి చైతన్యకు సన్మానం

ఉట్నూర్, ఏప్రిల్ 26 (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు జాదవ్ కుమారుడు సాయి చైతన్య సివిల్స్ లో 68వ‌ ర్యాంకు సాధించడంతో స‌న్మానం చేశారు. శనివారం ఉట్నూర్ లో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆధ్వర్యంలో తన నివాసంలో సాయి చైతన్యకు ఆయన తల్లిదండ్రులు గోవిందరావులకు శాలువాలతో సన్మానించారు.

సాయి చైతన్య ఐఏఎస్ కు ఎంపిక కావడం ఎంతో సంతోషకరమని, లంబాడ గిరిజన బిడ్డ ర్యాంక్ సాధించడం గర్వనీయమని రితీష్ రాథోడ్ అన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు పట్టుదలతో సాయి చైతన్య లాగా కృషి చేస్తే ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో రాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆదిలాబాద్ బీజేపీ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, బీజేపీ జిల్లా నాయకులు శ్రీపతి లింగ గౌడ్, బీజేపీ మండల నాయకులు బింగి వెంకటేష్, జాదవ్ రవీందర్, పెంట కైలాస్, సంపంగి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply