హైద‌రాబాద్ ఆంధ్రప్రభ : సద్గురు పరమహంస పులాజి బాబా(Sadhguru Paramahansa Pulaji Baba) చూపిన ఆధ్యాత్మిక ధ్యాన సన్మార్గాలు ఎంతో గొప్పవని స్ఫూర్తితో చూపిన మార్గంతో ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గొడం నగేష్(Godam Nagesh) అన్నారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్‌లో సిద్దేశ్వర సంస్థాన్‌(Siddheshwar Sansthan)లో నిర్వహించిన సద్గురు పూలాజి బాబా 101వ జయంతి వేడుకలు అధికారికంగా, ఘనంగా జరిగాయి.

ఈ వేడుకల్లో ఎంపీతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, త‌దిత‌రులు పాల్గొని బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు చేసి బాబా ఆశీస్సులు పొందారు. ఎంపీ మాట్లాడుతూ బాబా చూపిన మార్గంలో తాను 1994 నుండి రాజకీయాల్లో వచ్చినప్పటికీ బాబా ఆధ్యాత్మిక ధ్యాన బోధనలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో బాబా ప్రవచనాలు బోధనల వల్ల ఎన్నో కుటుంబాలు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాయన్నారు.

సమాజంలో అన్ని వర్గాలను ఏకతాటిపై చేర్చి ఆధ్యాత్మిక సన్మార్గాన్ని చూపిన మహనీయులన్నారు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే(Venkatesh Dotre) మాట్లాడుతూ.. బాబా మన జీవితాల్లో మార్పు రావాలని చేసిన ఆధ్యాత్మిక సేవలు ప్రశంసనీయమన్నారు. బాబా మానవసేవయే మాధవసేవగా కృషి చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యుడు సూచన మేరకు ఎంపీ నగేష్(MP Nagesh) తోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao)తో మాట్లాడి సమస్త అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు బాబా తపస్సు చేసిన దామాజీ లోయకు రోడ్డుతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్(State President Sukumar), భక్తురాలు కమల బాబా జీవిత చరిత్ర ప్రవచనాల ధ్యాన మార్గాలపై రచించిన గ్రంథ పుస్త‌కాల క్యాసెట్టును ఎంపీ, కలెక్టర్, ఎస్పీ వక్తల సమక్షంలో విడుదల చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిర క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ క్రాంతి లాల్(District SP Krantilal), కిన్వాట్ ఎమ్మెల్యే భీమ్రావు కేరం(Bhimrao Keram), మహారాష్ట్ర మాజీ మంత్రి శివాజీ రావు(Shivaji Rao), మాజీ ఎమ్మెల్యే ఉత్తoరావు ఇంగ్లె, మహారాష్ట్ర స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాందాస్, కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యాం నాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కత‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply