Sadashivnagar | సర్పంచ్ ఎన్నికల బహిష్కరణ

Sadashivnagar | సర్పంచ్ ఎన్నికలు బహిష్కరణ
Sadashivnagar | సదాశివనగర్, ఆంధ్రప్రభ : గత కొన్ని ఏళ్లుగా తమ గ్రామ సమస్యలు పరిష్కారం కావడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు (sarpanch and ward member elections) బహిష్కరిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా (Kamareddy District) సదాశివనగర్ మండలంలోని మల్లుపేట్ గ్రామస్తులు సమావేశమై సర్పంచ్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. 44వ జాతీయ రహాదారి పై బ్రిడ్జి నిర్మాణం చేయాలని, రెవెన్యూ గ్రామంగా ఏర్పాటుతో పాటు గ్రామ సమస్యలపై ప్రజాప్రతినిధులకు, ఉన్నత అధికారులకు అనేకసార్లు విన్నవించినా పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమస్యలు తీర్చలేని ఎన్నికలు మాకెందుకు అని ప్రశ్నిస్తున్నారు. నామినేషన్ వేయకుండా గ్రామపంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
