Ajit Pawar |మంచి నాయకుడిని కోల్పోయాం..

మంచి నాయకుడిని కోల్పోయాం..

  • అజిత్ ప‌వార్ మృతికి స‌చిన్ సంతాపం

Ajit Pawar | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఎన్నికల ప్రచార నిమిత్తం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే అజిత్ పవార్ మృతిపై టీమింయా దిగ్గ‌జ మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయ‌న మ‌ర‌ణంపై ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలిపారు. ‘అజిత్ పవార్ జీ అకాల మరణం గురించి తెలిసి చాలా బాధ పడుతున్నా. ప్రజల కోసం అంకితభావంతో పని చేసిన ఓ మంచి నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా సానుభూతి. ఓం శాంతి’ అని సచిన్ ఎక్స్ పోస్ట్ చేశారు.

Leave a Reply