నర్సరీ పరిశీలించిన ఎస్.ఎన్ పురం సర్పంచ్

బోధన్, ఆంధ్రప్రభ ; వర్ని మండల కేంద్రం సత్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన నర్సరీని శనివారం సర్పంచ్ కనకదుర్గ రవి పరిశీలించారు. హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ నర్సరీలో పెరుగుతున్న మొక్కలను గురించి తెలుసుకున్నారు.
వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా మొక్కలకు నీరు అందజేయాలని సూచించారు. వర్షాకాలంలో ఇంటింటికి మొక్కలు అందజేయడానికి వీలుగా మొక్కలు పెంచాల ని సూచించారు. ఆమె వెంట గ్రామ ఉప సర్పంచ్ రెడ్డి రాంబాబు, పంచాయతీ కార్యదర్శి సాయిలు వార్డు సభ్యులు శంకర్, ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు అశోక్, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు
