Rx100 Director | ఘట్టమనేని వారసుడు జయకృష్ణకు సక్సెస్ అందించేనా?

Rx100 Director | ఘట్టమనేని వారసుడు జయకృష్ణకు సక్సెస్ అందించేనా?
Rx100 Director | ఆర్ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి ప్రయాణం
జయకృష్ణ హీరోగా ‘శ్రీనివాస మంగాపురం’
లవ్ అండ్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా
రాషా తడాని ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన
ఘట్టమనేని కుటుంబ వారసుడిపై భారీ అంచనాలు
Rx100 Director | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆర్ఎక్స్ 100 సినిమా ఓ సంచలనం. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడం.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించడం తెలిసిందే. దీంతో ఈ మూవీ దర్శకుడు అజయ్ భూపతికి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే.. ఈ దర్శకుడు చేతిలో సూపర్ స్టార్ మహేష్ బాబు పెద్ద బాధ్యతే పెట్టారు. రమేష్ బాబు వారసుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తున్నాడు. మరి.. ఘట్టమనేని వారసుడుకి అజయ్ భూపతి సక్సెస్ అందించేనా..?

ఆర్ఎక్స్ 100 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన అజయ్ భూపతి.. మహా సముద్రం సినిమాతో మాత్రం మెప్పించలేకపోయాడు. ఆతర్వాత మంగళవారం అనే డిఫరెంట్ థ్రిల్లర్ మూవీతో సక్సెస్ సాధించాడు. ఆతర్వాత కొన్ని ప్రాజెక్టులు చేయాలని ట్రై చేశారు కానీ.. వర్కవుట్ కాలేదు. ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరో, కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు తనయుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తే శ్రీనివాస మంగాపురం అనే సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని నటిస్తుంది. లవ్ అండ్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమాని పి.కిరణ్ నిర్మిస్తుండగా సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ సమర్పిస్తున్నారు. జీవీ ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ కు సంబంధించిన లుక్ రిలీజ్ చేశారు. అతని రస్టిక్ ప్రపంచంలో ఆమె అతని ప్రశాంతత, అతని ఓదార్పు, అతని వేదన అని తెలియచేస్తూ.. ఇందులో రాషా తడాని మంగగా నటిస్తున్నట్టుగా తెలియచేశారు. ఆమె పస్ట్ లుక్ పోస్టర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. మొత్తానికి అజయ్ భూపతి.. తనదైన స్టైల్ లో డిఫరెంట్ స్టోరీతో రాబోతున్నాడు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఘట్టమనేని రమేష్ బాబు వారసుడి సినిమా పై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా శ్రీనివాస మంగాపురం ఉంటుందనే పీలింగ్ అయితే కలిగించాడు. త్వరలో మూవీకి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

