ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, బలమైన డాలర్ ప్రవాహాల మూలంగా భారత్ రూపాయి రెండు సంవత్సరాల్లో అత్యధికంగా లాభపడింది. ఇటీవల కాలంలో రూపాయి రోజువారీగా భారీగా పతనమైంది. డాలర్ ఇండెక్స్ బలపడడం, విదేశీ ఇన్వెస్టర్లు మన ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణతో రూపాయి అంతకంతకూ బలహీనపడింది.
తాజాగా ట్రంప్ అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలు, అనేక దేశాలపై టారిఫ్‌లు విధించడం వంటి కారణాలతో గత వారం నుంచి డాలర్ ఇండెక్స్ బలహీనపడుతోంది. శుక్రవారం నాడు డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.97 రూపాయలుగా ఉంది. క్రితం రోజు ముంగిపు 86.36తో పోల్చితే 39 పైసలు బలపడింది.
ఒక్క రోజులో ఈ స్థాయిలో రూపాయి బలపడడం రెండు సంవత్సరాల్లో ఇదే తొలిసారి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు బలపడడంతో పాటు, ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు పెట్టడం, ఫారెక్స్ మార్కెట్లో జోక్యంతో పాటు లిక్విడిటీకి ఆర్‌బీఐ మద్దతు ఇవ్వడం వంటి కారణాలతో రూపాయి బలపడింది.