Rules Break | నిబంధనలన్నీ నిండు ప్రాణాలు కాపాడేందుకే

Rules Break | నిబంధనలన్నీ నిండు ప్రాణాలు కాపాడేందుకే

  • రూల్స్ బ్రేక్ చేస్తేనే ప్రమాదాలు
  • రోడ్డుభద్రత ప్రమాణాలు పాటించండి
  • వేగం కన్న ప్రాణాలే ముఖ్యం
  • మద్యం మత్తులో డ్రైవింగ్ చేయోద్దు
  • కుటుంబాల్లో విషాదం నింపకండి
  • భద్రతలు పాటించడం బాధ్యత
  • ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మనీషా నెహ్రా

Rules Break | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : నిబంధనలన్నీ రోడ్డు ప్రమాదాలు నివారించి నిండు ప్రాణాలు కాపాడేందుకే ఏర్పాటు చేశారని గుర్తించి మసులుకోవాలని ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మనీషా నెహ్రా ఉద్బోధించారు. రోడ్డు ప్రమాధాలన్నీ రూల్స్ బ్రేక్(Rules Break) చేయడం వల్లే సంభవిస్తున్నాయని గుర్తు చేశారు.

ప్రతి వాహణదారుడు విధిగా రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించి సురక్షితంగా ఇళ్ళు చేరుకోవాలని ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మనీషా నెహ్రా సూచించారు. వరంగల్ రవాణా శాఖాధికారులు రోడ్డు భద్రత వారోత్సవాలు పురష్కరించుకొని ఈ రోజు వరంగల్ లోని పోచమ్మ మైదాన్ నుండి ఎంజిఎం హాస్పిటల్(MGM Hospital) వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.

Rules Break |

ఈ కార్యక్రమంలో వరంగల్ ఇంచార్జి ఆర్టీఓ శోభన్ బాబు, మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ జయపాల్ రెడ్డి, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ కోడూరు సుజాత ప్రభృతులు పాల్గొన్నారు.అతి వేగం హుషారు, ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తాయో, ఏమో కానీ ప్రాణాలను బలి తీసుకొనే ప్రమాదం పొంచి ఉందని ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మనీషా నెహ్రా హెచ్చరించారు.

మద్యం మత్తులో డ్రైవింగ్(Driving) చేయడం వల్లే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఎత్తి చూపారు.మద్యం కిక్ లో డ్రైవింగ్ చేస్తూ కుటుంబాల్లో విషాదాలు నింపొద్దని సూచించారు.రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించడం బాధ్యతగా గుర్తిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించ వచ్చునని ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మనీషా నెహ్రా హితువు చెప్పారు.

రూల్స్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడమో, పెనాల్టీలు(penalties) విధించడం తమ అభిమతం కాదని వరంగల్ ఇంచార్జి ఆర్టీఓ శోభన్ బాబు పేర్కొన్నారు. ట్రాఫిక్, ఆర్టీఓ రూల్స్ అన్నీ ప్రజలంతా సుఖ, సంతోషాలతో జీవించేందుకే రూపొందించారని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు సర్కార్ ఏర్పాటు చేసిన నియమ, నిబంధనలు పాటిస్తూ ఆనందమయ జీవితం గడపాలని వరంగల్ ఇంచార్జి ఆర్టీఓ శోభన్ బాబు సూచించారు.

Leave a Reply