RTC officials | గంగాపూర్ బస్సు ప్రారంభం..

RTC officials | గంగాపూర్ బస్సు ప్రారంభం..
RTC officials | కడెం (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : నిర్మల్ డిపో నుండి మండల కేంద్రమైన కడెం నుండి మారుమూల అటవీ గ్రామమైన గంగాపూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సును ఆర్టీసీ అధికారులు(RTC officials) పున ప్రారంభించారు. గురువారం కడెం మండల కేంద్రం నుండి మండలంలోని గంగాపూర్ గ్రామానికి చేరుకున్న ఆర్టీసీ బస్సును గంగాపూర్ కొర్ర తండా, రాణి గూడ గ్రామపంచాయతీల సర్పంచ్ లు వేడమ జంగు మాలవత్ విజయలక్ష్మి, దాసు నాయక్, తులసిం సీతారాంలు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు సాయంత్రం ఐదు గంటలకు కడెం నుండి గంగాపూర్ గ్రామానికి బస్సు నడుస్తుందని పై గ్రామపంచాయతీ పరిధిలోగల ప్రజలు, ప్రయాణికులు(passengers), మహిళలు, యువకులు ఈ బస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చక్రపాణి గంగాపూర్, మాజీ గంగాపూర్ఎంపీటీసీ, ఎం దాసు నాయక్, గంగాపూర్, ఉప సర్పంచ్ ఎల్లేష్, మాజీ సర్పంచ్ శాంత చంద్రహాస్, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
