ఆర్టీసీ బస్సు కారు డీ

ఆర్టీసీ బస్సు కారు డీ

  • నలుగురికి తీవ్ర గాయాలు..

శ్రీశైలం, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని శ్రీశైలానికి వెళ్లే రహదారిలో ఈ రోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్‌(Ghat Road)లో ఈ ప్రమాదం జరిగినట్లు శ్రీశైలం సీఐ తెలిపారు. శ్రీశైలం-డోర్నాల ఘాట్‌ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయాయి. శిఖరేశ్వరం(Shikareshwaram) దిగువన ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి.

విజయవాడ ఆర్టీసీ బస్సులో బెంగళూరు యాత్రికులు శ్రీశైలం దర్శనానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రభావతి, రవికుమార్, వెస్లీ తేజస్విని తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్(108 Ambulance) వాహనం ద్వారా క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సున్నిపెంట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply