దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం…

దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం…

తిరువూరు, ఆధ్రప్రభ : ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఏపీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ ప్రారంభించారు. బుధవారం తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.

ఈ సందర్భంగా దేవదత్త మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 40% కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చునని అన్నారు. వారితో పాటు ప్రయాణించే సహాయకులకు చార్జీలో 50% చార్జీల రాయితీ కల్పించనున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయనున్నదని దేవదత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ కే మనోజ, డిఎం ఏ సుబ్రహ్మణ్యం, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply