RTC | బంపర్ ఆఫర్..

RTC | బంపర్ ఆఫర్..

RTC, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ RTC డిపోల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకులకు టికెట్ ధరలో 10% రాయితీ ప్రకటించింది. ఇంద్ర, నైట్ రైడర్ వంటి ఏసీ సౌకర్యం ఉన్న సర్వీసుల్లో ఈ రాయితీ వర్తిస్తుందని మచిలీపట్నం డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉందన్నారు.

Leave a Reply