RTC | బస్సులో పొగలు…
- అప్రమత్తమైన ప్రయాణికులు
RTC | సదాశివనగర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో (Rtc Bus) నుండి పొగలు రావడంతో 67మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండలంలోని పద్మాజివాడి చౌరస్తా వద్దకు రాగానే.. బస్సు నుండి పొగలు రావడంతో ప్రయాణికులు అప్రమత్తమై దిగిపోయారు. సమాచారం అందుకున్న పద్మాజివాడి సర్పంచ్ లోకోటి సుబ్బారావు ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణికులతో మాట్లాడారు. ప్రయాణ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

