Rs praveen | తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన చేస్తోంది..

Rs praveen | తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన చేస్తోంది..
Rs praveen | ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది అనడానికి మున్సిపల్ ఎన్నికలు నిదర్శనం అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మున్సిపల్ ఎన్నికల్లో 30 శాతం ఓట్లను బీఆర్ఎస్ కొల్లగొట్టింది. గెలుపు కోసం కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు. పోలీసు శాఖను సీఎం దగ్దర పెట్టుకుని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఎన్నికల కమీషన్ కనీసం 15 రోజుల ముందే షెడ్యూల్ ఇవ్వాలి, కానీ మూడు రోజుల ముందే నోటిఫికేషన్ ఇస్తోందని ఆరోపించారు. మున్సిపాల్ ఎన్నికలను వారం రోజుల్లోనే పూర్తి చేసి SEC మమ అనిపించారు.
కాంగ్రెస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవ్వలేదన్నారు. రేవంత్ కి అనుకులంగా ఎన్నికల కమిషన్ పినిచేస్తోందని ఆరోపించారు.పోలీసులపై కాంగ్రెస్ నేతలు దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోలేదు, ప్రజలందరి ముందు జగ్గారెడ్డి పోలీసులను అవమానించిన ఎవరు పట్టించుకోరని పేర్కొన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన కమీషనరేట్ భవనం లాంటి భవనం అమెరికాలో కూడా లేదు, రూ. 700 కోట్ల మాజీ సీఎం కేసీఆర్ కట్టించారు. అలాంటి గొప్ప పట్టిష్ట కలిగిన పోలీసు వ్యవస్థను నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఇంత అరాచకం ఎందుకు సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఎన్ని దర్జన్యాలు చేసిన ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
