Rs.70 crore | సుస్థిర అభివృద్ధి దిశగా తిరువూరు
- రూ.70 కోట్లతో రహదారి పనులు
- వెనుకబడిన నియోజకవర్గానికి ప్రథమ ప్రాధాన్యత
- రహదారుల నిర్మాణంతో మరింత అభివృద్ధి
- రోడ్లను నిర్లక్ష్యం చేసిన వైసీపీ
- కనీసం మరమ్మతులు కూడా చేయని పరిస్థితి
- పది రోజుల్లో రూ 43.30 కోట్ల నిధుల విడుదల
- 4 మండలాల్లో ముమ్మరంగా రహదారి పనులు
- డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరిస్తాం
- తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు…
Rs.70 crore | ఆంధ్రప్రభ, తిరువూరు : ఏడాదిన్నర కూటమి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో రూ.70 కోట్ల(Rs.70 crore) నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తిరువూరు నియోజకవర్గానికి కేటాయించిందని తెలిపారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయించేందుకు సహకరించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన నియోజకవర్గంగా పేరు పొందిన తిరువూరులో గత కొంతకాలంగా సుస్థిర అభివృద్ధి కొనసాగుతోందన్నారు. అభివృద్ధి(development)కి అతి ముఖ్యమైన రహదారుల నిర్మాణం మరమ్మత్తులపై దృష్టి సారించామన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం రహదారుల మరమ్మత్తు కూడా చేపట్టకపోవడం దారుణం అన్నారు. గడిచిన 10 రోజుల్లోనే తిరువూరు నియోజకవర్గానికి రూ 43.40 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఆయన నియోజకవర్గ పరిధిలోని తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, ఏ కొండూరు మండలాలలో వేగంగా రహదారి నిర్మాణ పనులు(construction works) మరమ్మత్తులు జరుగుతున్నాయన్నారు. తిరువూరు పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో మెరుగుపరుస్తామన్నారు. అంతకుముందు ఆయన కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు

