అభివృద్ధి పనులలో సంపూర్ణ సహకారం అందించాలి..

అభివృద్ధి పనులలో సంపూర్ణ సహకారం అందించాలి..

పెడన – ఆంధ్రప్రభ : పెడన హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులలో సంపూర్ణ సహకారం అందించాలని కోరుతూ పెడన హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు శాసన సభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ని, పురపాలక సంఘ ప్రత్యేక అధికారి, పురపాలక సంఘం కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోక అంతిమ సంస్కారాలు నిర్వహణ ఇబ్బందిగా మారిందని, అలాగే మౌలిక వసతులు లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు వినతి పత్రం లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పెడన హిందూ స్మశాన వాటిక అభివృద్ధి విషయంలో రాజీ ప్రసక్తే లేదని త్వరలోనే పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారి సహకారంతో నిధులు విడుదల కానున్నాయని తెలిపారు. అలాగే పెడన హిందూ స్మశాన వాటికలో డ్రైనేజీ సమస్యను పరిష్కారం కోసం ఇప్పటికే రూ. 60లక్షలు నిధులు కేటాయించామని, అలాగే మౌలిక సదుపాయాల కోసం త్వరలోనే నిధులు విడుదల కృషి చేస్తామని అన్నారు.

Leave a Reply