పసిపాప ప్రాణాలకు భరోసా…

పసిపాప ప్రాణాలకు భరోసా…
చిన్నారి పునర్విక వైద్యం కోసం…
పి ఎం సహాయ నిధి రూ. 50 లక్షలు మంజూరు……
ఎంపీ బైరెడ్డి శబరి..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : చిన్నారి పసిపాప ప్రాణాలకు ప్రజాధర్బార్లో ఇచ్చిన హామీ మేరకు నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి ప్రధానమంత్రి సహాయ నిధి కింద 50 లక్షలు మంజూరు చేయించినట్లు బుధవారం తెలిపారు. కొద్ది కాలం క్రితం కార్యాలయంలో ఎం పి నిర్వహించిన ప్రజా దర్బార్‌లో చిన్నారి పునర్విక తల్లితండ్రులు తమ కుమార్తె అరుదైన వ్యాధితో బాధపడుతుందని, వైద్యం కోసం సహాయం కోరుతూ దృష్టికి తీసుకువచ్చారన్నారు.వారి ఆవేదనను విని వెంటనే స్పందించనన్నారు. చిన్నారి బాలిక పునర్వికకు అవసరమైన వైద్య సహాయం తప్పకుండా అందిస్తామని భరోసా ఇచ్చాన్నారు.నా ప్రయత్నాల ఫలితంగా పునర్విక చికిత్స కోసం ప్రధాని సహాయ నిధి (PM Relief Fund) నుంచి రూ.50 లక్షల ఆర్థిక సహాయం మంజూరైందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి తెలిపారు.ఇది పునర్విక కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చే విషయమన్నారు. ఈ సహాయం సాధ్యమయ్యేలా సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కేంద్ర వైద్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానాన్నరు. ప్రజల ఆరోగ్యం నా మొదటి బాధ్యత అంటూ చిన్నారి పునర్విక త్వరగా కోలుకుని ఆరోగ్యంగా జీవించాలనే ఆకాంక్షతో, ఆమె కుటుంబానికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎంపీ శబరి భరోసా ఇచ్చారు. ఆర్థిక సహాయానికి కుటుంబ సభ్యులు బాలిక బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.
