Rs. 4000 crores | కొత్త రైల్వే లైన్‌కు రూ. 4000 కోట్లు

Rs. 4000 crores | కొత్త రైల్వే లైన్‌కు రూ. 4000 కోట్లు

  • కుందన్‌పల్లి, కున్నారం, మంథని పనులపై కేంద్రానికి నివేదిక
  • సెమీకండక్టర్ ఫెసిలిటీ ఏర్పాటు కోసం కృషి చేస్తానన్న ఐటీ మంత్రి

Rs. 4000 crores | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : పార్లమెంట్‌ ప్రశ్నోత్తర సమయంలో రామగుండం ప్రాంతానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించిన ఐటీ మంత్రి మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలలో అనేక రైల్వే ప్రాజెక్టులు మంజూరు కావటం సంతోషకరమని తెలిపారు. తాజాగా రామగుండం– మణుగూరు కొత్త రైల్వే లైన్(Railway line)కు అనుమతి లభించిందని, దీనికి సుమారు రూ. 4000 కోట్లు(Rs. 4000 crores) నిధులు కోరినట్టు పేర్కొన్నారు.

అలాగే కుందన్‌పల్లి ప్రాజెక్ట్ కోసం రూ. 100 కోట్లు, కున్నారం ఫ్లైఓవర్, మంథని వంతెన కోసం రూ. 80 కోట్లు నిధులు అడిగినట్లు వివరించారు. ఈ పనులపై టైమ్‌లైన్‌(timeline) ఏమిటని అడగగా రైల్వే మంత్రి(Railway Minister) సానుకూలంగా స్పందించి త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. రైల్వే లైన్ స్థితిగతులపై మంత్రివర్గం నుంచి అప్‌డేట్ అందిందని తెలిపారు.

ఇక ఐటీ రంగంలో అభివృద్ధి దిశగా కూడా పెద్దపల్లి ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నానని ఆయన అన్నారు. “పెద్దపల్లిలో ఒక మంచి సెమీకండక్టర్(semiconductor) ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాను. ఈ ప్రాజెక్ట్ పరిశ్రమల అభివృద్ధికి, యువత ఉపాధి అవకాశాల పెరుగుదలకు దోహదం చేస్తుంది,” అని చెప్పారు.

మూడు–నాలుగు నెలల క్రితం తెలంగాణకు రావాల్సిన ఒక సెమీకండక్టర్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్‌కి మళ్లించారని, ఆ అంశాన్ని కూడా సభలో లేవనెత్తినట్లు తెలిపారు. పెద్దపల్లి ప్రాంత యువత ప్రతిభావంతులని, వారికి స్కిల్ డెవలప్‌మెంట్‌(Skill Development) కల్పించి సెమీకండక్టర్ రంగంలో అవకాశాలు ఇవ్వాలని కోరారు.

“ప్రభుత్వం ఇచ్చిన విపులమైన ప్రాజెక్ట్ రిపోర్ట్‌(project report)ను చదివి, దీని గురించి సభలో మరింత వివరంగా మాట్లాడతాన‌న్నారు. పెద్దపల్లిలో సెమీకండక్టర్ లేదా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తాను,” అని మంత్రి తెలిపారు.

Leave a Reply