Rs.207cr | దివ్యాంగులకు ఆత్మవిశ్వాసం నింపే ‘దివ్యాంగ శక్తి‘

Rs.207cr | దివ్యాంగులకు ఆత్మవిశ్వాసం నింపే ‘దివ్యాంగ శక్తి‘

బస్సు పథకం లాంఛనంగా ప్రారంభం
దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్

Rs.207cr | పడమట, ఆంధ్రప్రభ : విజయవాడ ఆటోనగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద బుధవారం ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ‘దివ్యాంగ శక్తి’ బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో ముచ్చటించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. పథకం ప్రారంభానంతరం ఆటోనగర్ బస్టాండ్ నుంచి తాడిగడప వరకు దివ్యాంగులతో కలిసి ప్రత్యేకంగా ప్రారంభించిన బస్సులో ఎమ్మెల్యే ప్రయాణం చేసి వారికి ఉత్సాహం నింపారు., ఈ సందర్బంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని అమలు చేస్తుందన్నారు.

ఈ పథకం ద్వారా దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. ఈ పథకం కింద ఏపీఎస్ఆర్టీసీ నిర్వహిస్తున్న సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడం జరిగిందన్నారు. మొత్తం 21 కేటగిరీలలో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు ఈ పథకానికి అర్హులన్నారు. దివ్యాంగులతో పాటు వారి సహాయకులను కూడా పరిగణనలోకి తీసుకుని సుమారు 12.76 లక్షల మంది లబ్దిదారులకు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నారు.

Rs.207cr |

ఇందుకోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.207 కోట్ల వ్యయాన్ని భరిస్తోందన్నారు. ఆర్టీసీ అధికారుల కూడా దివ్యాంగులకు అన్ని విధాలుగా సహకరించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పధకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు గద్దె రామమోహన్ దివ్యాంగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేరేపి ఈశ్వర్, పొట్లూరి రవీంద్ర, డిపో మేనేజర్ జి.రాజేష్, అసిస్టెంట్ మేనేజర్ రాంబాబు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ కె.శ్రీనివాస్, శంకర్, మణి, మోహన్, పితాని తదితరులు ఉన్నారు.

Rs.207cr |
Rs.207cr |

Leave a Reply