మీసేవ, ఆధార్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి…

మీసేవ, ఆధార్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి…
డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి.
మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న మీసేవ, ఆధార్ నమోదు కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి కోరారు. ఈరోజు డివైఎఫ్ఐ మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంచార్జ్ తహసిల్దార్ నేలపట్ల నరేష్‌కు వినతిపత్రం అందజేశారు.అనంత్రం ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం నిర్ణయించిన సర్వీస్ రుసుముకంటే అధికంగా పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొత్త ఆధార్ నమోదు ఉచితం అయినప్పటికీ ఒక్కొక్కరి నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. మీసేవ కేంద్రాల్లో పనులు త్వరగా చేయిస్తామని చెప్పి అదనపు డబ్బులు తీసుకుంటున్నారని విమర్శించారు.
ఇలాంటి కేంద్రాలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొడ్డుపల్లి నరేష్, నాయకులు మహేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
