Rs.2 lakhs | బేగంపేటలో గుడిసె దగ్నం…

Rs.2 lakhs | బేగంపేటలో గుడిసె దగ్నం…

Rs.2 lakhs | రాయపోల్, ఆంధ్ర‌ప్ర‌భ : రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో ఎరుకలి నర్సింలు నివాసముంటున్న గుడిసె విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా ప్రమాదవశాత్తు ఈ రోజు దద్దమైంది.ఈ ఘటనలో గుడిసెలో ఉన్న గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.

అలాగే సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. గుడిసెలో భద్రపరిచిన విలువైన డాక్యుమెంట్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయని తెలిపాడు. సమాచారం అందుకున్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు, అధికారులను కోరుతున్నారు.

Leave a Reply