బాధితుడికి రూ. 2 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్సీ….

బాధితుడికి రూ. 2 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్సీ….
ఊట్కూర్, ఆంధ్రప్రభ : మజ్లిస్ ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్ చికిత్స పొందుతున్న బాధితుడికి రూ. 2 లక్షల ఎల్‌ఓసీ శనివారంచెక్కును అందజేశారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల్ అధ్యక్షుడు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ శ్రీ హాఫిజ్ మౌల్వి అబ్దుల్ రెహ్మాన్ విజ్ఞప్తి మేరకు అబ్దుల్ అజీజ్ ఖాన్ నేమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సకాలంలో చికిత్స అందించేందుకు వీలుగా, మీర్జా రెహ్మత్ బేగ్ ఎమ్మెల్సీ ఆ వ్యక్తికి చికిత్స నిమిత్తం రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. మౌల్వి అబ్దుల్ రెహ్మాన్, మీర్జా రెహ్మత్ బేగ్ ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ముర్తజా భాయ్, పటేల్ నగర్ అహ్మద్ భాయ్ ముహమ్మద్ అష్ఫాక్, తదితరులు పాల్గొన్నారు.
