Rs. 2 lakh | కలెక్టర్ చొరవతో..

Rs. 2 lakh | కలెక్టర్ చొరవతో..
Rs. 2 lakh | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు పంపిణీ కోసం రూ. 2 లక్షల(Rs. 2 lakh) విలువ కలిగిన పుస్తకాలు, ఇతర సామగ్రిని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా శనివారం సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు చెన్నయ్యకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందించారు.
నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే అధికారులు, అనధికారులు పూల బొకేలు ఇచ్చే సంస్కృతికి స్వస్తి పలకాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సాధారణంగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తే.. సరిపోతుందని చెప్పారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో పేద పిల్లలకు ఉపయోగపడే సామాగ్రి అందించాలని సూచనప్రాయంగా తెలిపారు.
ఈ మేరకు పూల బోకేలకు బదులుగా స్పందించి జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన అధికారులు, అనధికారులు నోట్ పుస్తకాలు, పెన్నులు, పరీక్షల ప్యాడ్(exam pad)లు, జామెంట్రీ బాక్సులు, దుప్పట్లు అందించారు. దాదాపు రూ. 2 లక్షలు విలువ కలిగిన వీటిని జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లోని అవసరం ఉన్న పిల్లలకు అందించాలని జిల్లా కలెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులకు సూచించారు. సామాగ్రి అందించిన అధికార, అనధికారులకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. “మీరు వస్తు రూపంలో అందించిన విరాళాలు ఎంతో మంది విద్యార్థులకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని” అందిస్తుందని పేర్కొన్నారు.
