Marijuana| భారీగా గంజాయి పట్టివేత

Marijuana | భారీగా గంజాయి పట్టివేత
Marijuana | తూర్పు గోదావరి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు జోరుగా కొనసాగిస్తున్న ఆపరేషన్లో తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. డ్రోన్ (drone) సాయంతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో రూ.2 కోట్ల విలువైన గంజాయి (Marijuana) ని స్వాధీనం చేసుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ( police) గోకవరం మండలం కామరాజుపేట శివారులో అనుమానిత వ్యాన్ను గుర్తించారు. డ్రోన్ సహాయంతో నిఘా పెట్టిన పోలీసులు వ్యాన్లో గంజాయి ఉన్నట్లు ధృవీకరించుకున్నారు. స్మగ్లర్లు పోలీసులను గుర్తించి వ్యాన్ను వదిలేసి పరారైపోయారు.
వ్యాన్లో భారీగా గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మార్కెట్ విలువ రూ.2 కోట్ల (Rs.2 crores) కు పైగా ఉంటుందని అంచనా వేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్మగ్లర్ల (Smugglers) కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో డ్రోన్ టెక్నాలజీ వినియోగం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసుల కఠిన వైఖరిని చాటింది.
