Rs.13.85 cr | సీఎంఆర్ఎఫ్రూ 13.85 కోట్లు మంజూరు

Rs.13.85 cr | సీఎంఆర్ఎఫ్రూ 13.85 కోట్లు మంజూరు

Rs.13.85 cr | విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.13.85 కోట్ల ఆర్థికసాయాన్ని సీఎంఆర్ఎఫ్ నుంచి పేదలకు మంజూరు చేసినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన 16 మందికి మెరుగైన వైద్యసేవల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి తాజాగా లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి)లు మొత్తం రూ.20,53,447లు మంజూరయ్యాయి.

వీటిని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో లబ్దిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గురువారం అందజేశారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. లబ్ధిదారుల తరపున సీఎం చంద్రబాబు కి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Rs.13.85 cr |
Rs.13.85 cr |
Rs.13.85 cr |
Rs.13.85 cr |
Rs.13.85 cr |

Leave a Reply