Rs. 11 thousand | ఆపదలో మేము సైతం….

Rs. 11 thousand | ఆపదలో మేము సైతం….
Rs. 11 thousand | దండేపల్లి, ఆంధ్రప్రభ : ఆపదలో మేముసైతం అంటూ ముందుకు వచ్చిన యూవకులు, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన దుర్గం సుధాకర్ ఇటీవల మృతి చెందగా గ్రామానికి చెందిన శివ గణేష్ యూత్ సభ్యులు బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 11వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, వారి పిల్లల చదువుల్లో కూడా ముందుటామని హామీనిచ్చారు. గ్రామంలో ఎవరికి ఆపద వచ్చిన తాము ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో శివగణేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
