మీదికొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం…

మీదికొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం…

  • ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం
  • సర్పంచ్ జోగు సంపత్ కుమార్

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సర్పంచ్ జోగు సంపత్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ పథకాలతో పాటు గ్రామ ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. గురువారం స్టేషన్ ఘన్‌పూర్ మండలం మీదికొండ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో పలు కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఉపసర్పంచ్ అలకుంట్ల శ్రీనుతో కలిసి సర్పంచ్ ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రహదారులు, పారిశుధ్యం, తాగునీరు వంటి సమ స్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. గ్రామంలోని ప్రతి కాలనీకి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడం ద్వారా ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply