Rs. 1 lakh | నిందితుతులకు జైలు శిక్ష

Rs. 1 lakh | నిందితుతులకు జైలు శిక్ష

Rs. 1 lakh | జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాజైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మొక్కలు(Cannabis plants) సాగు చేసిన కేసులో నిందితుడైన ఎస్.మనోహర్ కు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 1 లక్ష(Rs. 1 lakh) జరిమాన, మరొక నిందితుడు ఎం.జ్ఞానేశ్వర్ కు 5 సంవత్సరాలు శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ సెషన్స్ కోర్టు(Sessions Court) ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్ ఈ రోజు తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ తెలిపారు.

ఎస్పీ వివరాల ప్రకారం, 2023 అక్టోబర్ 17న న జైనూర్ ఎస్ఐ సందీప్‌కు లభించిన విశ్వసనీయ సమాచారం మేరకు భూసి మెట్ట గ్రామంలోని పత్తి పంటలో నిషేధిత గంజాయి మొక్కలను సాగు చేస్తున్న ఎస్ మనోహర్ (340 గంజాయి మొక్కలు), జ్ఞానేశ్వర్ లు (30 గంజాయి మొక్కలు) పత్తి పంటలో తనిఖీ నిర్వహించారు.

మొత్తం 370 గంజాయి మొక్కలు బయటపడ్డాయని దీనిపై కేసు నమోదు చేసిన ఎఎస్‌ఐ రాథోడ్ ఉమేష్(ASI Rathore Umesh), తర్వాత దర్యాప్తు రెండవ ఐఓ జీ. మల్లేష్ ( జైనూర్ సిఐ), మూడవ ఐఓ కే. అంజయ్య (జైనూర్ సిఐ) విచారణ కొనసాగించారని ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జగన్మోహన్ రావు, తమ వాదనలు వినిపించగా, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ రామ్ సింగ్ సాక్షాదారాల సహకారం ద్వారా నిందితుడికి శిక్షపడేలా కీలకపాత్రపోషించారని ఎస్పీ తెలిపారు.

నిందితుడికి శిక్ష ఖరారయ్యేలా కృషి చేసిన ప్రస్తుత ఎస్సై జి. రవికుమార్, ప్రస్తుత సిఐ రమేష్, ఆసిఫాబాద్ ఎఎస్పీ చిత్తరంజన్ అలాగే కోర్ట్ లైజనింగ్ అధికారులను జిల్లా ఎస్పీ నితిక పంత్ అభినందించారు.

Leave a Reply