Rs. 1.50 lakhs | ఫేక్ ఐపీఎస్ అరెస్ట్…

Rs. 1.50 lakhs | ఫేక్ ఐపీఎస్ అరెస్ట్…

Rs. 1.50 lakhs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నకిలీ ఐపిఎస్ అధికారి హల్‌చల్ చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో చోటుచేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామంటూ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నుంచి రూ.1.50 ల‌క్ష‌లు తీసుకొని నకిలీ ఐపీఎస్ అధికారి కాజేశారు. చింతల చేను ప్రాంతానికి చెందిన కె.సురేష్ కుమార్ నేను ఐపిఎస్ అధికారినని చెప్పాడు. ఢిల్లీ నుండి హైదరాబాద్‌ వచ్చాన‌ని, ప్రస్తుతం సెలవులో ఉన్నానంటూ మాయమాటలతో వెంకటేశ్వర్లను బురిడికొట్టించాడు.

ఉద్యోగం ఇప్పిస్తానంటూ తిరుపతికి చెందిన‌ వెంకటేశ్వర్లు వద్ద యుపిఐ అకౌంట్ల ద్వారా కేటుగాడు నగదు కాజేశాడు. మోసపోయానని తెలిసి అలిపిరి పీఎస్‌లో వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నకిలీ ఐపిఎస్ అధికారి బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply