మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగోజిగూడెం గ్రామ మహిళలకు స్థానిక దివిస్ పరిశ్రమ యాజమాన్యం రూ. 1.18 లక్షల ఆర్థిక సహకారంతో కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివిస్ పరిశ్రమ సీనియర్ అధికారి కే శివప్రసాద్ చేతుల మీదుగా మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం దివిస్ పరిశ్రమ యాజమాన్యం తమ వంతు సహకారం అందిస్తుందని, ఈ కుట్టు మిషన్లను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ లైజన్ ఆఫీసర్ బి కిషోర్ కుమార్, గ్రామ కాంగ్రెస్ నాయకులు పల్లె సురేందర్ రెడ్డి, దివిస్ ప్రతినిధులు బి గోపి, వి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply